మంచి నటి అనిపించుకోవడం వేరు. స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం వేరు. అలా యాక్టింగ్ టాలెంట్ ఉండీ కూడా, హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోతున్న ముద్దుగుమ్మల్లో అనుపమా పరమేశ్వరన్ ఒకరు. 'శతమానం భవతి' వంటి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో ఉన్నప్పటికీ, ఈ ముద్దుగుమ్మని స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఊహించుకోలేకపోతున్నారు. త్వరలో 'తేజ్ ఐ లవ్‌యూ' సినిమాతో ఈ క్యూట్ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్‌లో అనుపమా చాలా బాగా ఎట్రాక్ట్ చేస్తోంది.
అయితే ఈ సినిమాతోనైనా స్టార్‌డమ్ సంపాదిస్తుందా? అంటే ఏమో సినిమా విడుదలైతే కానీ తెలీదు. అవకాశాలు అయితే బాగానే దక్కించుకుంటోంది. మెగా మేనల్లుడు తేజుతో నటిస్తున్న 'తేజ్ ఐ లవ్‌యూ' కాక, యంగ్ హీరో రామ్‌తో 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రంలోనూ అనుపమా నటిస్తోంది. ఈ రెండు సినిమాలూ కొంచెం గ్యాప్‌లోనే ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇకపోతే 'తేజ్ ఐ లవ్‌యూ' సినిమాతో ఇటు సాయి ధరమ్ తేజకూ, అనుపమతో లక్ కలిసి రావాల్సిందే. ఎందుకంటే తేజుకి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. భారీ అంచనాలతో సెట్స్ మీదికెళ్లిన సినిమాలు ఈ మధ్య తేజుని అంతే భారీగా నిరాశ పరిచేశాయి. లవ్ స్టోరీస్ ఎక్స్‌పర్ట్ అయిన కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో తేజు చేస్తాడో చూడాలిక.
అలాగే తేజు లవ్‌తో అనుపమా ఎలాంటి సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకోనుందో మరి.