రజినీకాంత్ కాలా తొలిరోజు కలెక్షన్స్

By iQlikMovies - June 08, 2018 - 16:20 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా తొలిఆట నుండే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం మొదలైంది. దీనితో ఇప్పటికే ఈ చిత్రానికి ఫ్లాప్ అనే ట్యాగ్ లైన్ ని కట్టబెట్టేశారు ప్రేక్షకులు.

ఇక తొలిరోజు కలెక్షన్స్ విషయానికి వస్తే, సుమారు రూ 30 కోట్లు మేర ఈ చిత్రం వసూలు చేసింది. అయితే ఇంత తక్కువ మొత్తంలో వసూలు చేయడానికి కారణాలు ఏంటంటే- బెంగళూరులో విడుదల ఆలస్యం అవ్వడం, మరికొన్ని చోట్ల అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోవడం.

అయితే రెండో రోజుకి ఈ అడ్డంకులు దూరమై ఈ రూ 30 కోట్ల మార్కుని దాటి వసూలు చేస్తుంది అని అంచనాలు ఉన్నాయి. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చాక కలెక్షన్స్ పెరగడం అనేది చాలా అరుదు అయితే ఇది రజినీకాంత్ సినిమా అవ్వడమే ఈ అంచనాలకి ఊతమిస్తున్నది.

రేపు ఉదయానికి ఈరోజు వసూళ్ళ పైన ఒక అంచనా రావొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS