రంగమ్మత్త 'రంగస్థలం' బుల్లితెరపై.!

మరిన్ని వార్తలు

'రంగస్థలం' త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది. ఈ వార్త విని వెంటనే అవాక్యయ్యారా? అయితే ఒక్క నిముషం ఆగండి. ఇది సినిమా కాదు. ఇదో రియాల్టీ షో. ఇంకా పర్‌ఫెక్ట్‌గా చెప్పాలంటే డాన్స్‌ రియాల్టీ షో అన్నమాట. ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించేదెవరో తెలుసా? మన రంగమ్మత్తే. అదేనండీ, హాట్‌ హాట్‌ అనసూయా భరద్వాజ్‌ అన్న మాట. 

ఆల్రెడీ వెండితెరపై ఇంపార్టెంట్‌ అండ్‌ రిజిస్టర్డ్‌ క్యారెక్టర్స్‌తో దూకుడు మీదున్న అనసూయ, బుల్లితెరపై కూడా అదే హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై హాట్‌నెస్‌లో ఏ యాంకర్‌కీ లేనంత క్రేజ్‌ మన రంగమ్మత్తకే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు లేటెస్టుగా వెలుగులోకి వచ్చిన ఈ డాన్స్‌ రియాల్టీ షోతో రంగమ్మత్త మరింత హాట్‌ అప్పీల్‌ ప్రదర్శించనుందనీ తెలుస్తోంది. 'రంగస్థలం' పేరుతో త్వరలోనే బుల్లితెరపై ప్రసారం కానున్న ఈ డాన్స్‌ రియాల్టీ షోకి అనసూయ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ కానుందట. ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా కానీ, అనసూయలో తెలియని ఆకట్టుకునే గ్లామర్‌ ఆమెకీ స్థాయిలో క్రేజ్‌ సంపాదించి పెడుతోంది. 

ఇటు బుల్లితెరపైనా, అటు వెండితెరపైనా, మరో వైపు సోషల్‌ మీడియాలో కూడా తన హాట్‌నెస్‌తో కుర్రోళ్లకు పిచ్చెక్కించేస్తోంది అనసూయ. అందుకే అనసూయ అంటే అమ్మాయిలందరికీ అంత అసూయ మరి. 'రంగస్థలం' సినిమాతో తిరుగులేని సక్సెస్‌ అందుకున్న అనసూయ వెండితెరపై మరిన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైన్‌ చేసేస్తోందట. అవేంటో ఒక్కొక్కటిగా త్వరలోనే అఫీషియల్‌గా రివీల్‌ చేస్తానంటోంది అందాల అనసూయ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS