అనుపమ విషయంలో ఆ గాసిప్‌ నిజమేనట!

మరిన్ని వార్తలు

'ప్రేమమ్‌' సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ 'అ,ఆ', 'శతమానం భవతి' చిత్రాలతో సూపర్‌ హిట్స్‌ తన ఖాతాలో వేసుకుంది. ఎలాంటి పాత్రనైనా డీల్‌ చేయగల సత్తా ఉంది ఈ ముద్దుగుమ్మకి. ఈ మధ్య ఓ సినిమాకి సంబంధించి సెట్స్‌లో స్క్రిప్టు ప్రిపేర్‌ అవుతున్న పిక్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఇక అంతే, ఇంకేముంది.. అనుపమ డైరెక్టర్‌ అయిపోనుందట అనే గాసిప్‌ పుట్టించేశారు.

 

గాసిప్‌ వీరులు. అయితే, అప్పట్లో అది జస్ట్‌ గాసిప్‌ మాత్రమే అనుకున్నవారందరికీ అనుపమా షాకిచ్చింది. అనుపమాలో యాక్టింగ్‌ టాలెంట్‌ మాత్రమే కాదు, డైరెక్షన్‌ టాలెంట్‌ కూడా ఉండనే ఉందట. ఆమెకు నటి కాకముందే, డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌పై ఆసక్తి ఉందట. ఎప్పటికైనా డైరెక్షన్‌ చేస్తానంటోంది. ఆల్రెడీ ఓ మలయాళ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం కూడా ఉందట మన క్యూట్‌ అనుపమకి. అయితే, పూర్తిగా డైరెక్షన్‌ పగ్గాలు చేత పట్టేసరికి, ఇక నటనకు గుడ్‌బై చెప్పేస్తానని హింట్‌ ఇస్తోంది.

 

త్వరలో అనుపమ 'రాక్షసుడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ 'రాక్షసన్‌'కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ టీచర్‌ పాత్ర పోషించింది. తమిళంలో అమలాపాల్‌ నటించిన ఈ పాత్ర చాలా సవాళ్లతో కూడుకున్నదని అనుపమ చెప్పుకొచ్చింది. ఆ పాత్రకు జీవం పోసేందుకు తనవంతు ప్రయత్నం చేసిందట. మెప్పించిందో లేదో తెలియాలంటే ఆగస్ట్‌ వరకూ వేచి చూడాల్సిందే. ఆగస్ట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటించాడు. రమేష్‌ వర్మ దర్శకత్వం వహించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS