అనుష్కకీ కోడి రామకృష్ణకీ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదంటే!

మరిన్ని వార్తలు

స్వీటీ అనుష్క కెరీర్‌ని రెండు భాగాలుగా డివైడ్‌ చేయొచ్చు. ‘అరుంధతి’కి ముందు, ‘అరుంధతి’కి తర్వాత అని. ‘సూపర్‌’ సినిమాలో గ్లామరస్ గా ఎట్రాక్ట్‌ చేసిన అనుష్క, ఆ పైనా కేవలం గ్లామర్‌ తారగానే అలరించింది. స్వీటీని జస్ట్‌ గ్లామర్‌ డాల్‌గానే చూశారంతా అప్పటి వరకూ. అయితే, ఆమెలోని జేజమ్మని చూసిన మొట్ట మొదటి డైరెక్టర్‌ కోడిరామకృష్ణగారు. జేజమ్మగా అనుష్కని మార్చేశారాయన ‘అరుంధతి’ సినిమాతో. అంతవరకూ అనుష్క మీద ఉన్న అభిప్రాయాలు ఆ సినిమాతో తొలిగిపోయాయి. ఓ సినిమా ఓ మనిషి వ్యక్తిత్వం పట్ల అభిప్రాయాన్ని కూడా మార్చేస్తుందంటే అది అరుంధతి సినిమానే అవుతుంది. ఆ నటి అనుష్క మాత్రమే అవుతుంది. అంతవరకూ అనుష్కని ఆడియన్స్‌ చూసిన యాంగిల్‌, ఆ సినిమాతో పూర్తిగా మారిపోయింది. ఊహించని హుందాతనం వచ్చేసింది అనుష్కలో.

 

అనుష్క ఎలా కనిపించినా ఆమె జేజమ్మే అనేలా ఆమె పట్ల తమ తమ అభిప్రాయాలు మార్చేసుకున్నారంతా. అంత గొప్పగా ఆమెను మలచిన క్రెడిట్‌ కోడి రామకృష్ణది. ఆ సినిమా చేయకుండా ఉండుంటే, ఆ తర్వాత ఆమె కెరీర్‌లో ‘దేవసేన’, రుద్రమదేవి’, ‘భాగమతి’ అనే పాత్రలు ఉండేవే కావేమో. అందుకే ఆయనను తలచుకుని అనుష్క కంట నీరు పెట్టింది. కెరీర్‌లో తనకు అంతటి గొప్ప స్థానాన్ని కట్టబెట్టి వెళ్లిపోయిన ఆయన పట్ల తనకున్న అనుబంధాన్ని తలచుకుని, ఎమోషన్‌ని కంట్రోల్‌ చేసుకోలేకపోయింది. అదీ ఆ డైరెక్టర్‌తో అనుష్కకి ఉన్న అపారమైన అనుబంధం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS