ట్రోలింగ్’ ఎంత అసహ్యంగా తయారైందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. సోషల్ రెస్పాన్సిబిలిటీ కోణంలో హీరో నితిన్, రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తనకు తోచిన సాయం ఈ రెండు ప్రభుత్వాలకూ అందించనున్నట్లు తెలిపాడు నితిన్. అంతే, ట్రోలర్స్ తయారైపోయారు. ‘ఎపిడమిక్ కాదు.. పాండమిక్ అనాలి..’ అంటూ ‘నత్తినాయాలా’ అనే తిట్టుని ప్రయోగించేశారు నితిన్ మీద. ఇలాంటోళ్ళని ఎన్‌కౌంటర్ చేసేస్తే తప్ప సమాజం బాగుపడదేమో.!
సమాజానికి వైరస్‌లో, టెర్రరిస్టులో మాత్రమే ప్రమాదకరం కాదు.. వీళ్ళు అంతకన్నా ప్రమాదకరమైన వ్యక్తులు. 10 లక్షల రూపాయల సాయం అంటే చిన్న విషయం కాదు. ఓ పేద కుటుంబానికి నెలకి వెయ్యి రూపాయల సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే, లక్ష రూపాయలతో వంద మందికి.. పది లక్షల రూపాయలతో 10 వేల మందికి సాయం చేయవచ్చన్నమాట. కష్టకాలంలో ఇది చాలా పెద్ద మొత్తంగానే భావించాలి. చేతనైతే, నితిన్ చేసిన సాయాన్ని అభినందించడంతోపాటు, తమకు తోచిన సాయం చేయాలిగానీ, ఈ ట్రోలింగ్ ఏంటి అసహ్యం కాకపోతే.? అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు సదరు హేటర్ మీద. సెలబ్రిటీలకు అభిమానులం.. అనే ముసుగులో చేస్తోన్న ఈ పిల్ల చేష్టల మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకునే సందర్భం కాదిది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రావ్‌ు వంటి సంస్థలే చర్యలు తీసుకుంటే మంచిది.