కాస్టింగ్ కౌచ్... చిత్రసీమని గత కొన్నాళ్లుగా పట్టి పీడుస్తున్న వైరస్. ఈ విషయంపై మాట్లాడేందుకు ఇది వరకు కథానాయికలు భయపడేవారు. కానీ ఇప్పుడు వాళ్లు ధైర్యం చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్‌పై తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. అనుష్క కూడా తొలిసారి ఈ విషయంపై నోరు విప్పింది. కొన్ని సంచలన విషయాన్ని చెప్పింది.
తనకు ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదని తేల్చేసింది అనుష్క. తాను ముక్కు సూటిగా వ్యవహరిస్తానని, అందుకే ఇలాంటి సమస్యలెప్పుడూ తన దరి చేరలేదని అంది. అడ్డదారుల్లో ఎదగడమా? లేదంటే కష్టపడి తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవడమా? అనేది కథానాయికల చేతుల్లో ఉందని, షార్ట్ కర్ట్లో గమ్యం చేరినవాళ్లు ఎక్కువ కాలం అక్కడ కొనసాగలేరని, కష్టపడి ఓ స్థానం సంపాదిస్తే అది ఎప్పటికీ చెదిరిపోదని చెప్పుకొచ్చింది స్వీటీ. కాస్టింగ్ కౌచ్ లేదని అనుష్క చెప్పడం లేదు గానీ, ఆ దారిలో వెళ్లాలా? లేదా? అనేది కథానాయికలే ఆలోచించుకోవాలని క్లారిటీగా చెబుతోంది. మరి నవతరం భామల దారెటో..?