సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్‌కి ఈమధ్య అస్సలు హిట్లు లేవు. ప్రతీ సినిమా అటు నిర్మాతల్నీ, ఇటు పంపిణీదారుల్నీ తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఇలాంటి దశలో ఆది సినిమాకి బిజినెస్ అవ్వడం కష్టం. అయితే `బుర్ర కథ`కి మాత్రం బాగానే గిట్టుబాటు అయినట్టు సమాచారం.
ఈ సినిమా థియేటరికల్ రైట్స్‌ని వింటేజ్ క్రియేషన్స్ సంస్థ 1.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2 కోట్లకు శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 50 లక్షలు వచ్చాయి. అంటే ఇప్పటికే 4 కోట్లకు పైగానే వ్యాపారం జరిగిందన్నమాట. వరుస ఫ్లాపుల మధ్య తన సినిమాకి ఈ రేంజ్లో వ్యాపారం జరగడం పెద్ద విషయమే. రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారిన సినిమా ఇది. ఈనెల 28న విడుదల అవుతోంది.