గోపీచంద్‌తో అనుష్క : అప్పుడు వేరు ఇప్పుడు వేరు

మరిన్ని వార్తలు

సినిమాలో ఏ స్థాయి గ్లామర్‌ పండించడానికైనా స్వీటీ బ్యూటీ అనుష్క సిద్ధంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ అది గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. గ్లామరస్‌ పాత్రలకు అనుష్క సైన్‌ చేయడం లేదు. సోలో హీరోయిన్‌గా ఆమెను పెట్టి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ తెరకెక్కిస్తే, ఓ స్టార్‌ హీరోకి రావల్సినంత క్రేజ్‌, వసూళ్లు రాబట్టగల స్టామినా ఉంది స్వీటీ బ్యూటీకి. ఆ విషయాన్ని ఆల్రెడీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'భాగమతి' సినిమా ప్రూవ్‌ చేసింది. 

అయితే ఆ తర్వాత మన స్వీటీ కొత్త సినిమాకి సైన్‌ చేయలేదింతవరకూ. అయితే అనుష్క ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్ట్‌కి సైన్‌ చేసిందని తెలుస్తోంది. గోపీచంద్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోందట. 'నేల టికెట్‌'ని రూపొందించిన నిర్మాతలు విజయ్‌, కిరణ్‌లు ఈ విషయాన్ని రివీల్‌ చేశారు. తమ నిర్మాణంలోనే అనుష్క నెక్ట్స్‌ సినిమా ఉండబోతోందని. ఇదంతా బాగానే ఉంది కానీ, స్టార్‌డమ్‌ విషయంలో గోపీచంద్‌తో పోలిస్తే, అనుష్కకే ఎక్కువ స్టార్‌డమ్‌ ఉందిప్పుడు. గతంలో గ్లామర్‌ తారగా గోపీచంద్‌తో పలు చిత్రాల్లో నటించింది అనుష్క. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. 

అందుకే ఈ సినిమాలో హీరోతో పాటు, హీరోయిన్‌ అనుష్కకి కూడా ఈక్వెల్‌ ఇంపార్టెన్స్‌ ఉండేలా స్క్రిప్టు ప్రిపేర్‌ చేస్తున్నారట. ముఖ్యంగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌తో పాటు, అనుష్కకి కూడా యాక్షన్‌ ఘట్టాలు ఎక్కువగా ఉండేలా ఆమె పాత్రను డిజైన్‌ చేస్తున్నారట. 'బాహుబలి'లో అనుష్క యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో భాగంగా విలువిద్యతో సత్తా చాటింది. ఈ సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతోందట. ఈ సినిమా కోసం వెరీ వెరీ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఘట్టాలను ప్లాన్‌ చేస్తున్నారట. 

త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS