అనుష్కని వెండి తెరపై చూసి ఎన్నాళ్లయ్యిందో కదా? వెండి తెర మాట అటుంచండి.. తను ఏ సినిమా ఫంక్షన్లోనూ కనిపించడం లేదు. తనకు సంబంధించిన లేటెస్ట్ పిక్ బయటకు వచ్చి కూడా చాలా కాలమైంది. సినిమాలకు అనుష్క మెల్లమెల్లగా దూరం అయిపోతోందేమో? అనే భయం ఆమె అభిమానులకు పట్టుకొంది. నవీన్ పొలిశెట్టితో అనుష్క ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి అప్ డేట్లు కూడా ఇంత వరకూ బయటకు రాలేదు. ఆ సినిమాలో అనుష్క ఉందా? లేదా? ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయిందా? అంటూ బోలెడన్ని అనుమానాలు చుట్టుముట్టాయి.
ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అనుష్క స్టిల్ బయటకు వచ్చింది. సోమవారం అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్వీటీ లుక్ విడుదల చేశారు. చెఫ్ లుక్ లో అనుష్క అందంగా, పద్ధతిగా కనిపించే సరికి అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. స్వీటీ ఈమధ్య బాగా లావైపోయిందన్నది అందరి కంప్లైంటూ. అయితే.. ఈ లుక్‌లో తను స్లిమ్ముగానే ఉంది. అది మరో గుడ్ న్యూస్. మొత్తానికి ఇంత కాలానికి అనుష్క దర్శనమిచ్చింది. ఇక మీదట.. తనకు సంబంధించిన అప్ డేట్ బయటకు వస్తూనే ఉంటుంది. కాబట్టి.. అనుష్కపై కొన్నాళ్ల పాటు ఎలాంటి రూమర్లూ వినిపించే ఛాన్స్ లేనట్టే.