అనుష్క ఇలా ఎందుకు చేస్తోందో..?

మరిన్ని వార్తలు

చాలా కాలం త‌ర‌వాత ఓ సినిమా ఈవెంట్‌లో క‌నిపించింది అనుష్క‌. నాని నిర్మాత‌గా తీసిన 'హిట్‌' ఆడియో లాంచ్‌లో స్వీటీ ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. ఈ మ‌ధ్య కాలంలో ఇలా ఓ ఈవెంట్లో పాల్గొన‌డం ఇదే తొలిసారి కావొచ్చు. నానితో ఉన్న స్నేహంతోనే తాను ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చాన‌ని చెప్పింది అనుష్క‌. స్నేహితుడి సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన‌డం త‌న బాధ్య‌త‌గా భావించిన స్వీటీ.. సొంత సినిమాని మాత్రం గాలికి వ‌దిలేయ‌డం విడ్డూరంగా మారింది. అనుష్క న‌టించిన‌ 'నిశ్శ‌బ్దం' త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్ల విష‌యంలో అనుష్క చాలా పేచీ పెడుతోంద‌ని టాలీవుడ్ టాక్‌.

 

ఇది వ‌ర‌కు హైద‌రాబాద్‌లో ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్ నిర్వ‌హించారు. దానికి అనుష్క రాలేదు. సినిమా విడుద‌ల విష‌యంలో జ‌రుగుతున్న ఆల‌స్యం అనుష్క‌ని బాగా ఇబ్బంది పెట్టింద‌ని స‌మాచారం. అందుకే స్వీటీతో ప్లాన్ చేసిన‌ కొన్ని ప్ర‌మోష‌న్ ఈవెంట్స్‌కి ఆమె నుంచి మ‌ద్ద‌తు రాలేదు. నిజానికి ప్ర‌మోష‌న్ల విష‌యంలో అనుష్క చాలా ప‌ద్ధ‌తిగా ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టించిన‌ప్పుడు, మొత్తం తానై చూసుకుంటుంది. అయితే 'నిశ్శ‌బ్దం' విష‌యంలో మాత్రం అనుష్క ముందు నుంచీ సైలెంట్ గానే ఉంది. ఇప్పుడు ఈసినిమా ఏప్రిల్‌ కు షిఫ్ట్ అయిపోయింది. అస‌లు సిస‌లైన ప్ర‌మోష‌న్ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉంది. ఈలోగా.. ఈ సినిమాపై స్వీటీ అభిప్రాయం మారుతుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS