ప్రస్తుతం ఎక్కడ విన్నా ప్రభాస్ సినిమా టాపిక్కే. నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమాపై ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు.. రాసేసుకుంటున్నారు. వైజయంతీ మూవీస్ దాదాపు మూడొందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా పాతాళభైరవి రీమేక్ అని సినీ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది. అసలు నిజంగా ఇది పాతాళభైరవి రీమేకేనా? లేక పాతాళభైరవి ఇన్‌స్పిరేషన్‌గా చేస్తున్న సినిమానా? అసలు తెలుగు క్లాసిక్ పాతాళభైరవికీ దీనికీ ఏమైనా సంబంధం ఉందా?
నిజానికి ప్రభాస్ సినిమాకీ ఎన్టీయార్ పాతాళభైరవికీ అస్సలు సంబంధంలేదట. ఇది పూర్తి వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న చిత్రమని, ఇండియన్ స్క్రీన్‌మీదే ఇప్పటివరకూ టచ్ చేయని కథాంశంతో నాగ అశ్విన్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందరూ అనుకుంటున్నట్టు ఇది జానపదమూకాదు.. అలాగనీ పీరియాడిక్ కథా కాదు.. అందుకని హిస్టారికల్ మూవీ అనుకుంటే అదీ కాదు.. ఆఖరికి సైన్స్ ఫిక్షన్ కూడా కాదు. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నడిచే కథ అని...
ఈమధ్య నాగ అశ్విన్ ఓ హింట్ ఇచ్చాడు. నిజానికి ఇది సైన్స్ ఫిక్షన్ కూడా కాదని తెలుస్తోంది. అభిమానుల ఊహాగానాలకు తెరదించాలని నాగ అశ్విన్స్ సైన్స్ ఫిక్షన్ అని చెప్పాడని, అసలు ఈ కథ ఎలాంటి జోనర్‌కీ చెందని విచిత్రమైన కథ అని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు మూడు జోనర్లని మిక్స్‌చేస్తూ కథలు అల్లుకోవడం ఈమధ్య హాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తోంది. నాగ అశ్విన్ కూడా అదే పంథాలో ఈ కథ సిద్ధం చేశాడని టాక్. టైమ్ మిషన్ లాంటి ఓ ఎపిసోడ్ సైతం ఇందులో కనిపిస్తుందని తెలుస్తోంది. మొత్తానికి..ఇదేదో ప్రయోగాత్మక కమర్షియల్ సినిమాలానే తోస్తోంది.