స్వీటీ అనుష్క అంటే స్క్రీన్‌పై నిండైన విగ్రహం, నిలువెత్తు అందానికి నిదర్శనం.. ఇవే గుర్తొస్తుంటాయి. స్వీట్ స్వీట్‌గా క్యూట్ క్యూట్‌గా నోట్లోంచి ముత్యాలు రాలుతున్నాయా.. అన్నట్లుగా ఆమె నోటి వెంట వచ్చే మాటలుంటాయి. కానీ, అనుష్కలోనూ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉందన్న సంగతి ఎవరికైనా తెలుసా.? సెన్సాఫ్ హ్యూమర్కే అమ్మమ్మ అయిన సుమక్కకే అనుష్క పంచ్లేయగలదని ఊహించారా.? అయితే మీకీ విషయం తెలియాల్సిందే. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ‘నిశ్శబ్ధం’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, బుల్లితెరపై అనుష్క సందడి చేసింది. ఏదో ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటుందిలే అనుకుంటే పొరపాటే. సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ షో క్యాష్‌లో అనుష్క దర్శనమిచ్చింది. పంచ్‌ల రాణి సుమకే పంచ్‌లేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. వచ్చే వారం ఈ షో ప్రసారం కానుంది. ఈ లోగా ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రోమోస్ తెగ హల్చల్ చేస్తున్నాయి. అనుష్కలో ఇంత అల్లరి పిల్ల దాగుందా.? అని ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. అనుష్క అల్లరి చేష్టల్ని జస్ట్ శాంపిల్గానే చూసిస్తున్న ఈ షో ప్రోమోస్‌తో, ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా.. ఫుల్ షోని ఎంజాయ్ చేస్తామా.? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అనుష్క ముద్దు ముద్దు మాటలతో పాటు, అనుష్క నుండి కొన్ని తెలియని సీక్రెట్స్ కూడా బయటికి లాగేసిందట సుమ. అవన్నీ తెలుసుకోవాంటే, ఈ వారం ‘క్యాష్’ షో అస్సలు మిస్ కాకూడదు మరి. అదీ సంగతి.