చిరంజీవి - అనుష్క ఈ కాంబినేషన్ చూడాలని తెలుగు సినీ అభిమానులు, మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. 'స్టాలిన్'లో ఓ పాటలో మెరిసింది అనుష్క. ఇప్పుడు 'సైరా'లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే.. వీరిద్దరినీ పూర్తి స్థాయి సినిమాలో చూడాలని అభిమానుల ఆశ. అనుష్క కూడా ఇదే విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించింది. అయితే ఆ అవకాశం వచ్చినా - అనుష్క వదులుకోవాల్సివచ్చింది.
విషయం ఏమిటంటే - చిరంజీవి - కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. 'సైరా' ముగిసిన వెంటనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఇందులో కథానాయికగా ముందు అనుష్క పేరే పరిశీలించారు. కాకపోతే.. 'ఈ సినిమా కోసం కాస్త లావు తగ్గాల్సివస్తుంది' అని చిత్రబృందం చెప్పిందట.
అయితే.. తను ప్రస్తుతం బరువు తగ్గే ప్రస్తకే లేదని, తన ఆరోగ్యం అందుకు సహకరించడం లేదని తేల్చి చెప్పిందట. దాంతో చిత్రబృందం అనుష్కని పక్కన పెట్టాల్సివచ్చింది. బాహుబలి తరవాత అనుష్క బాగా బరువు పెరిగింది. ఆమధ్య బరువు తగ్గి స్లిమ్ గా మారి కొత్త ఫొటోలు విడుదల చేసింది. అయితే ఇప్పుడు అనుష్క మళ్లీ బరువు పెరిగిందని, ఇదివరకటిలా బొద్దుగా మారిందని సమాచారం.