ఎట్టకేలకు ఆ 'బెస్ట్‌' ఛాన్స్‌ కొట్టేసిందిగా.!

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ మెహ్రీన్‌కి 'ఎఫ్‌ 2' సక్సెస్‌ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత మెహ్రీన్‌కి ఆఫర్లు వరదలా పోటెత్తుతున్నాయి. ఇప్పటికే తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తోంది. గోపీచంద్‌తో 'చాణక్య' ఒకటి కాగా, యంగ్‌ హీరో నాగశౌర్యతో ఇంకో సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. మరో సినిమా చర్చల దశలో ఉంది. ఇకపోతే, తెలుగుతో పాటు, తమిళంలోనూ గోల్డెన్‌ ఛాన్సెస్‌ వస్తున్నాయి మెహ్రీన్‌కి. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌తో మెహ్రీన్‌.. అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

 

ఆ ప్రచారం నిజమైందనిపిస్తోందిప్పుడు. ధనుష్‌ తాజా సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ ఎంపికైందట. దురై సెంథిల్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలో ధనుష్‌ డబుల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్రకు జోడీగా మెహ్రీన్‌ని ఎంచుకున్నారట. మరో పాత్ర కోసం సీనియర్‌ నటి స్నేహ ఎంపికైందని సమాచారమ్‌. ఇదిలా ఉంటే, కరెక్ట్‌గా అబ్జర్వ్‌ చేసి చూస్తే, ఎక్కువగా మెహ్రీన్‌కి సెకండ్‌ హీరోయిన్స్‌ పాత్రలే వస్తున్నాయనాలేమో.

 

కాజల్‌తో, తమన్నాతో తెలుగులో ఆల్రెడీ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది మెహ్రీన్‌. ఇప్పుడు తమిళంలోనూ స్టార్‌ హీరోయిన్స్‌కి యంగర్‌ వెర్షన్‌ హీరోయిన్‌గా మెహ్రీన్‌ ఆప్షన్‌ అవుతోంది కాబోలు. ఏది ఏమైతేనేం, ధనుష్‌ వంటి హీరోతో నటించే ఛాన్స్‌ దక్కించుకోవడమంటే చిన్న విషయమేమీ కాదు. అందుకే హనీ ఈజ్‌ ద బెస్ట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS