బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ గతేడాది విరాట్ కోహ్లీని వివాహమాడిన సంగతి తెలిసిందే. ప్రేమలో ఉంటే పెళ్లయిపోయిందనీ, పెళ్లయితే తల్లయ్యిందనీ పుకార్లు చాలా కామన్‌గా వింటుంటాం. సెలబ్రిటీల విషయంలో ఈ పుకార్లు మరి కాస్త ఎక్కువే. ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే, అనుష్కా శర్మపై ఇలాంటివే కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ మధ్య. అనుష్క ప్రెగ్నెంట్ అనీ, అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదనీ బాలీవుడ్లో అక్కడక్కడా గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇలాంటి గాసిప్స్‌ని హీరోయిన్లు పెద్దగా పట్టించుకోరు. కానీ అనుష్కా శర్మ మొదట్లోనే స్పందిస్తే మంచిదనుకుంది కాబోలు. పెళ్లిని దాచడం సాధ్యమే కానీ, గర్భాన్ని దాచడం సాధ్యం కాదు.. అంటూ ఈ గాసిప్‌కి గట్టి కౌంటరే ఇచ్చింది. అవును ఇది నిజమే. పెళ్లి చేసుకుని కూడా కాలేదని ప్రచారం చేసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ అలా కాదు కదా. అందుకే తనపై వస్తున్న పుకార్లు ఫేక్ అని అనుష్క తేల్చేసింది. అయినా అనుష్క ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.
చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్స్‌లో ఉన్న అనుష్కపై ఇలాంటి పుకార్లు హాస్యాస్పదమే. ప్రస్తుతం అనుష్క నటించిన 'జీరో' మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. మరుగుజ్జు పాత్రలో షారూఖ్‌ఖాన్ నటించిన ఈ సినిమాలో అనుష్కా శర్మ వీల్‌చైర్‌కి పరిమితమైన హ్యాండిక్యాప్డ్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ మరో హీరోయిన్గా నటిస్తోంది. ఈ నెల 21న 'జీరో' ప్రేక్షకుల ముందుకు రానుంది.