బాలీవుడ్ సోయగం... అనుష్క శర్మ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ధృవీకరించింది. `ఇక నుంచి మేమిక ముగ్గురం..` అంటూ ఓ క్యాప్షన్ పెట్టి, ట్విట్టర్‌లో విరాఠ్‌తో ఉన్న ఫొటోని షేర్ చేసింది. గత కొన్నాళ్లుగా అనుష్క సినిమా వాతావరణానికి పూర్తిగా దూరంగా ఉంటోంది. షూటింగులు, కొత్త కథలు, వాణిజ్య ప్రకటనలు.. అన్నీ బందే. అప్పటి నుంచే.. `అనుష్క వ్యక్తిగత జీవితంలో ఏమైనా విశేషం జరగబోతోందా` అంటూ ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలెట్టారు.
లాక్ డౌన్ వల్ల, ఐపీఎల్ వాయిదా పడింది. విరాఠ్ కూడా.. ఇంటి పట్టునే ఉంటూ.. సమయాన్ని పూర్తిగా అనుష్క శర్మకి కేటాయించడం మొదలెట్టాడు. మొత్తానికి ఈ దంపతులు ఓ శుభవార్త చెప్పేశారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కోసం పూర్తి ప్రాక్టీస్ మొదలెట్టాడు విరాఠ్. ఈ ఉత్సాహంతో.. ఐపీఎల్‌లో కదం దొక్కుతాడేమో చూడాలి.