అనుష్క 50 వ సినిమా టైటిల్ ఫిక్స్

మరిన్ని వార్తలు

సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క శెట్టి చాలాకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. లాంగ్ గ్యాప్ తరవాత 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ మూవీ హిట్ అవటంతో స్వీటీ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. అనుష్క కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాల్లో నటించినా, తరవాత లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అందరి స్టార్ హీరోలతో నటిస్తూ ఫాన్స్ ని సంపాదించుకుంది. మళ్ళీ ఇప్పుడు స్వీటీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడంతో తన ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 


మళయాలంలో మొదటిసారిగా అడుగుపెట్టబోతోంది. 'కథనార్ - ది వైల్డ్ సోర్సెరర్' అనే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఇది అనుష్కకి  49వ చిత్రం.  నెక్స్ట్ తెలుగులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క నటించనుంది. ఉమెన్ సెంట్రిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనుష్కకి 50 వ సినిమా.  ఈ మధ్య ఒక డ్రగ్స్ కేస్  లో క్రిష్ చిక్కుకోవటంతో అనుష్క మూవీ ఆగిపోయింది అనే ప్రచారం జరిగింది. కానీ వీటికి చెక్ పెడుతూ ఇప్పుడు ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. 


మంగళవారం ముంబై వేదికగా నిర్వహించిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఈవెంట్ లో ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి 'ఘాటి' అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేసారు. ప్రీ లుక్ పోస్టర్ లో అనుష్క ఫేస్ రివీల్ చేయకుండా, చీరకొంగుతో ముసుగు కప్పుకొని నడిచి వెళ్తున్న బ్యాక్ సైడ్ లుక్ ను ఆవిష్కరించారు. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథ అని, పరిస్థితుల కారణంగా గంజాయి వ్యాపారంలో చిక్కుకున్న ఓ మహిళ పగ, ప్రతీకారం, విముక్తికి చెందిన గ్రిప్పింగ్ స్టోరీని వివరిస్తుందని మూవీ టీమ్ పేర్కొంది. అనుష్క పాత్ర 'క్వీన్ ఆఫ్ సౌత్' తరహాలో ఉంటుందని సమాచారం. అనుష్క, క్రిష్ కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ ఇది. మొదట వీరు వేదం సినిమాకోసం కలిసి వర్క్ చేసారు. 'ఘాటి'. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల నిర్మాణంలో వంశీ కృష్ణ రెడ్డి, రాజీవ్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి చింతకింది శ్రీనివాస్‌ రావు రచయితగా పని చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS