ప్రజంట్ వచ్చే ఏ భాషా చిత్రానికి అయినా థియేట్రకల్ హక్కులతో పాటు OTT బిజినెస్ కూడా ముఖ్యమే. సినిమా వసూళ్ళలో OTT లు కీలక పాత్ర వహిస్తున్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. కోట్ల రూపాయల పెట్టుబడి నిర్మాత చేతికి రావడంలో డిజిటల్ రైట్స్ వాటా ఎక్కువ ఉంటోంది. OTT లు కూడా రైట్స్ కి భారీ మొత్తం చెల్లిస్తున్నాయి. కారణం కొన్ని సినిమాలు థియేటర్స్ లో ప్లాఫ్ అయినా ఓ టీటీ ల్లో ఆదరణ పొందుతున్నాయి. విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' సినిమాకి అప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం.
టాలీవుడ్ లో అగ్ర నిర్మాత అయిన 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తెరకెక్కుతున్న 54వ సినిమా 'ఫ్యామిలీ స్టార్' వసూళ్లు మొదలయ్యాయని టాక్. 'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం. ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ మీద 'దిల్' రాజు కాన్సంట్రేషన్ చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. థియేట్రికల్ బిజినెస్ కోసం 50 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.
విజయ్ కెరియర్ లో గీత గోవిందం లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నాడు. విజయ్, పరశురామ్ హిట్ కాంబోకి గోల్డెన్ లెగ్ అయిన మృణాల్ కూడా యాడ్ అవటంతో ఓటీటీ రైట్స్ మంచి రేటు వచ్చినట్టు టాక్. ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్' థియేటర్లలో సందడి చేయనుంది.