స్వీటీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకునే అనుష్క ప్రయోగం పేరు చెప్పి ఎంచుకున్న 'సైజ్ జీరో' సబ్జెక్ట్ ఆమె కెరీర్‌ని దెబ్బతీసేసిందనడంలో అతిశయోక్తి కాదు. ఆ సినిమా తర్వాత విడుదలైన 'బాహుబలి 2' షూటింగ్ అంతకు ముందే కంప్లీట్ అయిపోయిన కారణంగా జేజమ్మ ఆ సినిమాలో సన్నగానే కనిపించింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'భాగమతి'లో మాత్రం లావుగానే కనిపించింది. అనుష్క సన్నబడిందట అనే ప్రచారం తప్ప, నిజంగా అనుష్క సన్నబడి, మునుపటి ఫిగర్‌లో కనిపించింది లేదు 'సైజ్‌జీరో' సినిమా తర్వాత.
కానీ ఇప్పుడు నిజంగానే అనుష్క సన్నబడింది అంటూ కొత్త ప్రచారం మొదలైంది. అనుష్క నుండి 'భాగమతి' సినిమా తర్వాత వస్తున్న సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుంది. కోన వెంకట్ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అలాగే మాధవన్‌తో 'సైలెన్స్' మూవీలోనూ అనుష్క నటిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా కోనవెంకట్ అనుష్క కొత్త సినిమా లుక్ గురించి ట్విట్టర్‌లో ప్రస్థావించారు. స్టన్నింగ్ లుక్‌లో అనుష్క కనిపించబోతోంది త్వరలో అని అభిమానుల్ని ఊరించే ప్రయత్నం చేశారు కోనవెంకట్.
అయితే కోనవెంకట్ చెప్పినట్లుగా అనుష్క సన్నబడిందా.? లేదా.? యోగా టీచర్ అయిన అనుష్కకు బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఎందుకో మరి పెరిగిన బరువును తగ్గించుకోలేకపోతోంది స్వీటీ. ఏమో ఒకవేళ ఈ సారి అనుష్క నిజంగానే స్లిమ్ అయ్యిందేమో. అదే జరిగితే అనుష్క కోసం అవకాశాలూ మళ్లీ క్యూ కడతాయనడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు. అసలే చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్రహీరోలు ఫుల్ ఛార్జ్‌లో ఉన్న ఈ తరుణంలో వారి సరసన హీరోయిన్స్‌గా అనుష్క వంటి హీరోయిన్లు అందుబాటులో ఉంటే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.