భయపెట్టడమే సరదా అంటోన్న ముద్దుగుమ్మ.!

మరిన్ని వార్తలు

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ నందితా శ్వేత. చేరడేసి కళ్లతో, ఏ ఎక్స్‌ప్రెషన్‌ అయినా ఇట్టే పలికించేయగల టాలెంట్‌ ఉన్న ఈ భామ లేటెస్టుగా 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమంటోంది. నెంబర్‌ని అస్సలు నమ్మనంటోంది. అలాగే ఎక్స్‌పోజింగ్‌ కూడా పెద్దగా చేయనంటోంది. ముఖ్యంగా హారర్‌, యాక్షన్‌ మూవీస్‌ అంటే తనకు చాలా ఇష్టమట. 

 

మొదటి సినిమాతోనే దెయ్యం పాత్రతో భయపెట్టి ఆకట్టుకుంది. మళ్లీ ఇప్పుడు ఇంకోసారి భయపెడతానంటోంది. 'ప్రేమకథా చిత్రం 2' లో దెయ్యం పాత్ర పోషిస్తున్నది నందితా శ్వేతనే. ఇది కాక మరో మూడు నాలుగు తెలుగు చిత్రాలకు సైన్‌ చేసిందీ కన్నడ కుట్టీ. వాటిలో 'అక్షర' చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. తమన్నా దెయ్యం పాత్రలో మెరిసిన 'అభినేత్రి' సీక్వెల్‌లో దెయ్యం పాత్ర పోషిస్తోంది నందితా శ్వేత. 

 

అలాగే తమిళ, కన్నడంలోనూ బిజీగానే ఉంది. కన్నడలో 'కిరాతక' అనే చిత్రంలో నటిస్తోంది. 'కేజీఎఫ్‌'తో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడైన యష్‌ ఈ సినిమాలో కథానాయకుడు. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నుండి వచ్చే ఏడాది ఎన్ని మంచి సినిమాలు రానున్నాయో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS