'మజ్ను' మార్క్‌ సాంగ్‌ వచ్చేసింది.!

మరిన్ని వార్తలు

అక్కినేని అఖిల్‌ మూడో చిత్రంగా తెరకెక్కుతోన్న 'మిస్టర్‌ మజ్ను' నుండి రెండో ఆడియో సింగిల్‌ బయటికి వచ్చింది. 'దేవదాసు మనవడో.. మన్మధుడికి వారసుడో..' అంటూ సాగే ఈ సాంగ్‌ యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసేలా ఉంది. సాంగ్‌ లిరిక్స్‌తో పాటు, మేకింగ్‌ వీడియో కూడా రిలీజ్‌ చేశారు. ఇప్పుడీ వీడియో ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్‌ మేకింగ్‌ వీడియోలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఉన్నాడు. 'మిస్టర్‌ మజ్ను' యూనిట్‌ని కలిసి అప్రిషియేట్‌ చేస్తున్నారు రామ్‌చరణ్‌. 

 

కాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో ఈ సినిమా గ్రాండియర్‌ లుక్‌లో తెరకెక్కినట్లు విజువల్స్‌ చూస్తుంటే అర్ధమవుతోంది. 'సవ్యసాచి' ఫేం నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అఖిల్‌, నిధి అగర్వాల్‌ ఇద్దరూ గుడ్‌ డాన్సర్స్‌. కానీ ఇంతవరకూ విడుదలైన పోస్టర్స్‌లో ఎక్కడా వీరి మధ్య కెమిస్ట్రీని సరిగా చూపించలేదు. డాన్సింగ్‌ స్టిల్స్‌ కూడా బయటికి రాలేదు. 

 

తొలి ఆడియో సింగిల్‌ విరహ గీతం కాగా, తాజా సాంగ్‌ హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌. సో ఈ సాంగ్‌లో మజ్ను టైటిల్‌కి యాప్ట్‌ అయ్యేలా అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తున్న అఖిల్‌ చుక్కల్లో చంద్రుడిలా కనిపిస్తున్నాడు. తొలి రెండు సినిమాలతోనూ అంతగా ఆకట్టుకోలేని అఖిల్‌ ఈ సారైనా ఆశించిన ఫలితాన్ని 'మిస్టర్‌ మజ్ను'తో అందుకుంటాడో లేదో చూడాలి మరి.! 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS