హీరోలకు ధీటుగా, స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ముద్దుగుమ్మ అనుష్క ప్రస్తుతం సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకుంది. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. 'భాగమతి' సినిమా తర్వాత అనుష్క మరో సినిమాలో కనిపించలేదు. కానీ ఇప్పుడిప్పుడే అనుష్క కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. అందులో భాగంగా మాధవన్ హీరోగా రూపొందుతోన్న థ్రిల్లర్ చిత్రం 'సైలెన్స్'కి ఆల్రెడీ ఓకే చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లో మరికొన్ని ప్రాజెక్టులు స్వీటీ సంప్రదింపుల చర్చల్లో భాగమై ఉన్నాయి.
ఇక తాజాగా మణిరత్నం తెరకెక్కించబోయే భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అనుష్కను హీరోయిన్గా ఎంచుకోవాలనుకుంటున్నారట. నిజానికి ఈ సినిమాకి నయనతారను మొదట హీరోయిన్ అనుకున్నారట. కానీ ప్రస్తుతం ఆమె రజనీకాంత్‌తో 'దర్బార్' సినిమాలోనూ, విజయ్‌తో ఓ సినిమాలోనూ నటిస్తుండడంతో ఆ ఛాన్స్ స్వీటీని వరించబోతోందని తెలుస్తోంది. విక్రమ్, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రల్లో భారీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ. అందుకే స్టార్డమ్ ఉన్న హీరోయిన్ని ఎంచుకోవాలనుకుంటున్నారట.
అంతేకాదు, ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మోహన్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారనీ తెలుస్తోంది. టెక్నికల్‌గా 'బాహుబలి' రేంజ్లో ఈ సినిమా ఉండబోతోందట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఏది ఏమైనా స్వీటీ అంటే స్వీటీనే. గ్యాప్ తీసుకున్నా ఆమె కోసం భారీ బడ్జెట్ చిత్రాలు మళ్లీ కాచుకుని కూర్చున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే మళ్లీ స్వీటీ హవాకి ఢోకా లేదనే చెప్పాలి.