జేజమ్మా.! అలా చేశావేంటమ్మా?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ జేజమ్మగా తనదైన స్థాయిలో స్టార్‌డమ్‌ దక్కించుకుంది స్వీటీ అనుష్క. టాలీవుడ్‌ నుండి అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకునే హీరోయిన్‌గా, ఆ మాటకొస్తే, సౌత్‌ నుండి నయనతార తర్వాతి స్థానం అనుష్కదే అని కూడా చెప్పుకోవాలి. భారీ ప్రాజెక్టులు అంటే, ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్కనే. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాగా తెరకెక్కిన 'భాగమతి'తో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్‌ చేసుకుంది అనుష్క.

 

అయితే, పెరిగిన బరువును తగ్గించుకోలేక చాలా అవకాశాలు అనుష్కని వదిలిపోయాయి. కానీ, ఇప్పుడు అనుష్క సన్నబడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె 'సైలెన్స్‌' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అనుష్క లుక్‌ని సీక్రెట్‌గా ఉంచుతున్నారు. అయితే, తాజాగా అనుష్క లుక్స్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అవి అనుష్క లేటెస్ట్‌ పిక్స్‌ అనీ ప్రచారం జరుగుతోంది. ఆ పిక్స్‌లో అనుష్క మరీ మునుపటి అంత స్లిమ్‌గా కనిపించడం లేదు. భారీగానే కనిపిస్తోంది. అంటే, జేజమ్మ ఆశించిన రీతిలో బరువు తగ్గలేదా.? అనే అనుమానాలు నెలకొంటున్నాయి. ఇదిలా ఉంటే, అనుష్క 'సైరా నరసింహారెడ్డి'లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

Image result for megan fox reppin the u

ఈ సినిమా అనుష్కతోనే మొదలవుతుంది అనే టాక్‌ ఉంది. ఝాన్సీ లక్ష్మీభాయ్‌ కాలం నాటి కథగా సినిమా మొదలై, రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీలోకి తీసుకెళతారట. ఝాన్సీ లక్ష్మీభాయ్‌ పాత్రలో అనుష్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ప్రజలకు నేరేట్‌ చేస్తుందని తాజాగా అందుతోన్న సమాచారమ్‌. ఈ సమాచారంలో నిజమెంతో తెలియాలంటే, అక్టోబర్‌ 2 వరకూ ఆగాల్సిందే. ఆ రోజే 'సైరా' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏది ఏమైనా, పైనల్‌గా 'సైరా' కథ అనుష్కతోనే మొదలవుతుందని మాత్రం ఫ్యాన్స్‌ ఫిక్సయిపోవచ్చునేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS