ఇటీవల 'సీత', 'రాక్షసుడు' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, 'సీత'తో నిరాశపరిచినా, 'రాక్షసుడు'తో హిట్ అందుకున్నాడు. ఇంతవరకూ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ 'సీత'తో కొత్త జోనర్ ట్రై చేశాడు. కానీ ఫెయిలయ్యాడు. అయితే, ఈ సారి కూడా ప్రయోగమే చేయాలనుకుంటున్నాడట. అయితే, ఆ ప్రయోగం వికటించకుండా ఉం డేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
తన ప్రయోగాన్ని సక్సెస్ చేసే కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా దర్శకుడు త్రినాధరావు నక్కినను ఎంచుకున్నాడనీ తెలుస్తోంది. 'సినిమా చూపిస్తా మామా', 'నేను లోకల్', 'ఉన్నది ఒక్కటే జిందగీ' తదితర చిత్రాలతో మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు నక్కిన త్రినాధరావు. మంచి కామెడీ టైమింగ్, అక్కడక్కడా గుండెకు హత్తుకునే సీన్స్‌ని హైలైట్ చేయడంలోనూ ఆయన దిట్ట.
ఇక ఈయనతో మన బెల్లంకొండ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న హిట్ దక్కుతుందా? అంటే వేచి చూడాలి మరి. త్వరలోనే ఈ కాంబో మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారనీ సమాచారమ్. ఇకపోతే, బెల్లంకొండతో నక్కిన చేయబోయే ప్రయోగం ఎలా ఉంటుందయ్యా.. అంటే, 'సినిమా చూపిస్త మామా' తరహాలో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందనీ తెలుస్తోంది.