'బిగ్' కపుల్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జంట వరుణ్ - వితకలు తొలి రోజు నుండీ ఆశక్తి క్రియేట్ చేస్తున్నారు. బిగ్ హౌస్‌కి వీరిద్దరూ సమ్‌థింగ్ డిఫరెంట్ అట్రాక్షన్. అఫీషియల్‌గా భార్యా భర్తలు.. హోస్ట్ వీరిద్దరికీ సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించారు. అయినా కానీ, ఎక్కడా హద్దులు దాటకుండా ప్రవర్తిస్తున్నారు. మూతి విరుపులు, గిల్లి కజ్జాలు, క్యూట్ హగ్గింగులు, నాటీ చేష్టలతో బిగ్ హౌస్‌లో సరదాలు నింపుతున్నారు.
అయితే, లేటెస్ట్‌గా వీరిద్దరి మధ్యా ఓ చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. తన కోసం టైమ్ స్పెండ్ చేయడం లేదని వితిక, వరుణ్‌తో గొడవ పడింది. 24 గంటలు నీతోనే ఉంటున్నా.. కదా.! ఇంకేంటి స్పెషల్‌గా టైం కేటాయించేది. మనమిక్కడికి గేమ్ ఆడడానికి వచ్చాం.. అంటూ వరుణ్, వితికను మందలించాడు. వరుణ్ మందలింపుకు ఎప్పటిలాగే కొళాయి విప్పేసింది వితిక. అయితే, ఈ సారి కాస్త సీరియస్‌గా వీరి మధ్య డిస్కషన్ జరిగింది. వరుణ్ కూడా వితిక విషయంలో విస్తుగా అనిపించాడు. 'నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా.. వెళ్లు వాళ్లతో నీ టైమ్ స్పెండ్ చేసుకో పో..' అంటూ వరుణ్‌ని చీదరించింది వితిక. ఇలా వీరిద్దరి మధ్యా గొడవ ఎందుకు, ఎలా, ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలీదు కానీ, సీరియస్‌గా మారింది. ఇకపోతే, డే వన్ నుండీ వరుణ్ ప్రవర్తన డిగ్నిఫైడ్‌గానే అనిపిస్తోంది.
హోస్ట్ నాగార్జున వీరిద్దరికీ ఫ్రీడమ్ ఇచ్చినా కానీ, వరుణ్ మాత్రం చాలా హుందాగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. వితిక మాత్రం ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూసినట్లుగానే భర్త విషయంలోనూ వ్యవహరిస్తోంది. చివరికి వరుణ్ కూడా వితికను అదే కారణం చూపించి దెప్పి పొడిచాడు. దాంతో వితికకు అలక మరింత ఎక్కువైంది. మరి వీరిద్దరి గొడవ తీర్చేేందుకు మిగిలిన హౌస్ మేట్స్ ఏం చేస్తారో.? ఎలా వీరి అలక తీరుతుందో.? చూడాలిక.