'సైరా' గాయంపై స్పందించిన 'స్వీటీ'!

మరిన్ని వార్తలు

సైరా షూటింగ్‌లో ఉండగా, అనుష్క గాయపడిందనీ, ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన డాక్టర్లు అనుష్కకు తగిలిన గాయం కారణంగా కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకోవాలని సూచించారనే న్యూస్‌ ఈ మధ్య హల్‌చల్‌ చేస్తోంది. అయితే, గాయం చిన్నదే అభిమానులు పెద్దగా కంగారు పడే పరిస్థితి అయితే లేదు. కానీ, ఈ వార్తపై లేటెస్ట్‌గా స్వీటీ స్పందించింది. 'నేను బాగానే ఉన్నా.. లవ్‌ యూ ఆల్‌' అని అనుష్క సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

 

'నేను బాగానే ఉన్నా..' అని చెప్పింది. కానీ, తనకు అసలు గాయం తగిలిందా.? లేదా.? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు స్వీట. దాంతో అనుష్క గాయపడింది అనే వార్తలో నిజం లేదంటున్నారు కొందరు. ప్రస్తుతం అనుష్క 'సైలెన్స్‌' సినిమాతో బిజీగా ఉంది. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతోంది. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

 

మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కోసం అనుష్క సియాటెల్‌లో సంతోషంగా గడుపుతోంది. ఈ షూటింగ్‌ స్పాట్‌ నుండే, అనుష్క తన ఆరోగ్యం విషయమై జరుగుతున్న ప్రచారానికి స్పందించింది. ఈ సినిమాకి కోనవెంకట్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS