డస్కీ బ్యూటీ అమలాపాల్ పేరు ఇప్పుడు ఎంతలా మార్మోగిపోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు కారణం 'ఆడై' తెలుగులో 'ఆమె' పేరుతో విడుదలవుతున్న సినిమా టీజరే అని చెప్పడం అతిశయోక్తి కాదు. తెలుగులో ఆల్రెడీ 'నాయక్', బెజవాడ' తదితర చిత్రాల్లో నటించిన అమలాపాల్ ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకుంది. కానీ, మలయాళంలోనూ, తమిళంలోనూ ఆమె ఓ స్టార్ హీరోయినే అందులో సందేహం ఏమీ లేదు.
అయితే, 'ఆడై' తర్వాత అమలాపాల్ తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో నటించాల్సి ఉంది. కానీ, ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు కానీ, ఈ సినిమా నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ నుండి సడెన్‌గా అమలాపాల్‌ని తప్పించేశారట. అమలాపాల్ తప్పుకోవడంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా అమలాపాల్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.. అనేది ఓ వెర్షన్ అయితే, నిర్మాతలే కావాలని అమలాపాల్‌ని తప్పించేశారు. అందుకు కారణం 'అడై' టీజరే అనేది ఇంకో వెర్షన్. అయితే, 'అడై' టీజర్‌తో అమలాపాల్ ఏ స్థాయిలో సెన్సేషన్ అయ్యిందో వారికీ తెలుసు.
అలాంటి ఓ సెన్సేషనల్ స్టార్ తమ సినిమాలో ఉంటే, సినిమాకి ఖచ్చితంగా ప్లస్సే అవుతుంది. కానీ, నిర్మాతలు ఏ యాంగిల్‌లో ఆలోచించి ఆమెను తప్పించారో తెలియడం లేదు. అమలాపాల్ వెర్షన్ ఏంటంటే, నిర్మాతల ద్వంద్వ వైఖరి నచ్చకే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నానని చెబుతోంది. అంటే, ఈ ప్రాజెక్ట్ నుండి అమలా ఔట్ అయిపోవడానికి ఖచ్చితంగా సమ్‌థింగ్ ఏదో ట్విస్ట్ లేకపోలేదని అర్ధమవుతోంది.