మ‌హ‌ర్షి.... 32 రోజుల లెక్క‌లివి

By iQlikMovies - June 10, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

మ‌హ‌ర్షి రూపంలో మ‌హేష్ బాబుకి మ‌రో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ దొరికేసింది. ఈ వేస‌విలో తెలుగు సినిమాకి, బాక్సాఫీసుకీ స‌రికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిన సినిమా ఇదే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రం మే 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వ‌సూళ్ల ప‌రంగా టాలీవుడ్ టాప్ 5 చిత్రాల జాబితాలో స్థానం సంపాదించుకుంది.

 

32 రోజుల‌కు గానూ.. స‌రిగ్గా 99.5 కోట్ల షేర్ సాధించి - మ‌హేష్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా మిగిలిపోయింది. అయితే కొన్ని ఏరియాల్లో బ‌య్య‌ర్లకు న‌ష్టాలు మిగ‌ల‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. సీడెడ్, నెల్లూరులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ‌లేక‌పోయింది. ఓవ‌ర్సీస్ లో అయితే 2 కోట్ల న‌ష్టం వ‌చ్చింది. నైజాంలో 30 కోట్ల మార్కుకు అతి చేరువ‌లో వ‌చ్చింది. మ‌హేష్ సినిమా నైజాంలో ఈ స్థాయిలో వ‌సూలు చేయ‌డం ఇదే ప్ర‌ధ‌మం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS