'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నాగశౌర్య. 'ఊహలు గుసగుసలాడే'తో పాటు, 'దిక్కులు చూడకు రామయ్యా', 'జ్యో అచ్చుతానంద', 'ఛలో' తదితర సినిమాలతో హిట్లు కొట్టాడీ యంగ్ హీరో. చాలా సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. హీరోయిన్స్‌తో రొమాన్స్ కూడా కొత్తేమీ కాదు. కానీ, నాగశౌర్యతో రొమాన్స్ కూసింత కష్టమబ్బా అంటోంది సమంత. సమంతతో 'ఓ బేబీ' సినిమాలో నటిస్తున్నాడు నాగశౌర్య. సమంత లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీమ్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో నాగశౌర్య గురించి ఇంతవరకూ తెలియని ఓ నిజం తెలిసింది.
అదేంటంటే, నాగశౌర్య వెరీ షై అట. హీరోయిన్స్‌ని చూస్తే ఆమడ దూరం పారిపోతాడట. రొమాంటిక్ సీన్స్‌లో నటించాల్సి వస్తే, బిగుసుకుపోతాడట. అలా రొమాంటిక్ సీన్స్‌లో నాగశౌర్యని నటింపచేయడం చాలా కష్టమైందని డైరెక్టర్ నందినీ రెడ్డి తెలిపారు. నందినీ రెడ్డే కాదు, సమంత కూడా అదే విషయం నొక్కి నొక్కి చెబుతోంది. రొమాంటిక్ గై నాగశౌర్యలో ఇంత మంచి గుణం దాగుందా.? అంటూ అమ్మాయిలు షాకవుతున్నారు. అయితే, చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్ చించేసిన నాగశౌర్య ఎందుకు ఇలా ప్రవర్తించాడంటారు.? ఒకవేళ సమంత అక్కినేని కోడలనే రెస్పెక్ట్‌తో నాగశౌర్య ఆమెను రొమాంటిక్ సీన్స్‌లో ఊహించుకోలేకపోయాడా.? లేక నిజంగానే సమంత, నందినీ రెడ్డి చెప్పినట్లు నాగశౌర్యకు అమ్మాయిల పట్ల అంత షై ఫీలింగ్ ఉందా.? ఉంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిలుంటారా.? అదీ సినీ రంగంలో.. అని మనం కూడా ఆశ్చర్యపోవాల్సిందే సుమీ.!