ఈ పెళ్ళిళ్ళ సీజన్ మొత్తం సినీ సెలబ్రిటీస్ దే. అన్ని భాషల యాక్టర్స్ వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఎక్కువమంది హీరోయిన్స్ ఈ సీజన్ లో పెళ్లి చేసుకుంటుండగా హీరోలు తక్కువే ఉన్నారు. రీసెంట్ గా టాలీవుడ్ హీరో ఆశిష్ రెడ్డి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మెన్ అయ్యాడు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా పెళ్ళికి రెడీ అయ్యాడు. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి, చాల కష్ట పడి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ తో తన జర్నీ మొదలు పెట్టి, తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు. ‘రాజావారు రాణీగారు’ అనే ఫీల్ గుడ్ మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. తరవాత తనకి వచ్చిన అవకాశాలను సక్రమంగా వినియోగించుకుని నిర్మాతల హీరో అనిపించుకున్నాడు.
‘SR కళ్యాణమండపం’తో మంచి హిట్ సాధించి, సక్సెస్ ఫుల్ గా జర్నీ కొనసాగిస్తున్న ఈ హీరో ఇన్నాళ్ళకి పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం నిశ్చితార్ధం జరగనుంది. కిరణ్ చేసుకోబోయే అమ్మాయి ఇంకెవరో కాదు హీరోయిన్ రహస్య గోరఖ్. అదే నండి రాజా వారు రాణి వారు సినిమాలో నటించిన క్యూట్ గర్ల్. అవును వీరిద్దరికీ ఇదే మొదటి సినిమా, ఆ సినిమా నుంచి వీరికి పరిచయం , తరవాత అది ప్రేమగా మారింది. ఇపుడు వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
సోషల్ మీడియా విస్తృతంగా వాడుకలో ఉండటంతో ప్రజంట్ ఎవరు, ఏది దాచలేరు. ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామన్న దాగదు. కిరణ్ - రహస్య ల సీక్రెట్ లవ్ స్టోరీ కూడా ఇది వరకే నెటిజన్స్ పసిగట్టారు. ఒక సందర్భం లో వీరివురు పోస్ట్ చేసిన ఓ పిక్ లో బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉందని, వాళ్లిద్దరూ కలిసే ఉన్నారని, రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. నెక్స్ట్ కిరణ్ కొత్త ఇంటి గృహప్రవేశం లో కూడా రహస్య మెరవటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్ళకి ఆ రూమర్స్ కి తెరదించుతూ వీరు వివాహ బంధంతో ఒకటి కానున్నారు.