పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మరో ఇంట్రెస్ట్రింగ్ ప్రాజెక్ట్... `ఆది పురుష్`. ప్రభాస్ కెరీర్‌లో మరో భారీ బడ్జెట్ చిత్రమిది. ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ ఆల్రెడీ ఫిక్సయ్యాడు. మోహన్ బాబు ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సీత పాత్ర కోసం గట్టి పోటీ ఏర్పడింది. కీర్తి సురేష్, కైరా అద్వాణీ లాంటి పేర్లు గట్టిగా వినిపించాయి. ఇప్పుడు మరో రెండు పేర్లు ఈ లిస్టులో చేరాయి. బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మ సీతగా కనిపించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు అనుష్క శెట్టికీ ఆ ఛాన్సుందని చెప్పుకుంటున్నారు.
ఈ ఇద్దరు అనుష్కలలో ఒకరు... ప్రభాస్ పక్కన సీతగా సెట్టవుతారని సమాచారం. అనుష్క తో ప్రభాస్‌కి మంచి బాండింగ్ ఉంది. బాహుబలితో వీరిద్దరి కెమిస్ట్రీ మరోసారి బాగా పండింది. ఆ సినిమాతో అనుష్క కూడా బాలీవుడ్ జనాలకు దగ్గరైంది. అనుష్క శర్మతో పోలిస్తే.. అనుష్క శెట్టికే సీత అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాలీవుడ్ మీడియా సైతం కథనాలు ప్రచురిస్తోంది. మరి ఈ పోరులో.. ఎవరు గెలుస్తారో చూడాలాఇ.