మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్‌తో దర్శనమిచ్చేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఆ లుక్‌లో ఆయన గుండుతో కన్పించడమే అందుక్కారణం. చిరంజీవి నెగెటివ్ రోల్‌లో నటించేందుకోసమే ఈ న్యూ లుక్.. అనే ప్రచారం జరుగుతోంది. కాదు కాదు, ఆచార్యలో సెకెండ్ గెటప్ అంటున్నారు కొందరు. ఇవేవీ కాదు, ‘వేదాలం’ సినిమా రీమేక్ కోసం సరికొత్త గెటప్.. అని మరికొందరు చెబుతున్నారు. వీటిల్లో ఏది నిజమోగానీ, చిరంజీవి చుట్టూ చాలామంది చాలా చాలా కథలు అల్లేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కరోనా లాక్‌డౌన్ సమయంలో చాలా చాలా చేశారు, చేస్తూనే వున్నారు. ఇంట్లో దోశలు వేశారు.. చేపల కూర వండారు.
ఇలా సోషల్ మీడియాలో అభిమానుల్ని అలరించేందుకు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అలా అభిమానుల్ని అలరించేందుకోసం ఇదో కొత్త గెటప్.. అని అత్యంత విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలుస్తోంది. మరోపక్క, ఎప్పుడూ డిఫరెంట్ లుక్ కోసం ట్రై చేసే చిరంజీవి, ఈసారి కూడా అదే ఆలోచనతో ఈ కొత్త లుక్‌ని ప్రయత్నించారని కూడా అంటున్నారు. కాగా, ‘ఆచార్య’ త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ఇందుకోసం మునుపటి గెటప్‌ని సంతరించుకోవాలి గనుక.. ఫ్రెష్‌గా ఇలా ‘గుండు’ చేయించుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
ఏం చేసినా మెగాస్టార్ చాలా చాలా స్పెషల్ అంతే. ఏమో, చిరంజీవిని నెగెటివ్ షేడ్స్ వున్న రోల్‌లో కూడా చూడబోతున్నామేమో. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, చిరంజీవి ‘గుండు’ ఫొటోతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయారు. బాస్.. గుండు బాస్.. మెగా బాస్ అంతే.!