సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ‘ఉప్పెన’ సినిమా గత ఏప్రిల్‌లో విడుదల కావాల్సి వుంది. కరోనా దెబ్బకి ఆ సినిమా విడుదల వాయిదా పడిన విషయం విదితమే. ‘ఉప్పెన’ కంటే కొద్ది రోజులు ముందు విడుదల కావాల్సిన ‘వి’ కూడా వాయిదా పడి, చివరికి ఓటీటీలో రిలీజ్ అయిపోయింది ఇటీవలే. ఇక, ఇప్పుడు ‘ఉప్పెన’ కూడా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందట. ఇందుకోసం భారీ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ తప్ప ఇంకో దారి సినీ పరిశ్రమకు కనిపించడంలేదు. నిర్మాణం పూర్తయిపోయిన సినిమాల్ని ఎక్కువ కాలం అలాగే వుండం వీలయ్యే పని కాదు. దాంతో, ఆయా సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. అయితే, ‘ఉప్పెన’ సినిమాని ఎలాగైనా థియేటర్లలోనే విడుదల చేయాలని ఇప్పటికీ చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. కానీ, ఓటీటీ నిర్వాహకుల నుంచి భారీ ఆఫర్ రావడంతో అటువైపుగా కూడా మొగ్గు చూపుతున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్‌లో ‘ఉప్పెన’ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం వుందని సమాచారం అందుతోంది.
‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా కృతి శట్టిె హీరోయిన్‌గా పరిచయమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సనకి ఇదే డెబ్యూ మూవీ. దర్శకుడు, హీరో, హీరోయిన్.. ఇలా చాలా తెరంగేట్రాలు ‘ఉప్పెన’ సినిమాతో జరుగుతున్నాయి. మెగా కాంపౌండ్ నుంచి వస్తోన్న వైష్ణవ్, తొలి సినిమా రిలీజ్‌పై చాలా ఆశలు పెట్టుకున్నా, ఇప్పుడిక ఓటీటీ రిలీజ్‌తో సరిపెట్టుకోక తప్పేలా లేదు.