అనుష్క 'సైలెన్స్‌' అందుకే!

మరిన్ని వార్తలు

దాదాపు రెండేళ్ల లాంగ్‌ గ్యాప్‌ తర్వాత జేజమ్మ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సైలెన్స్‌'. తెలుగులో 'నిశ్శబ్దం' పేరుతో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు, మరో రెండు భాషల్లోనూ విడుదల కానుంది. టైటిల్‌లో ఉన్న సైలెన్స్‌ని ఇన్నాళ్లూ కంటిన్యూ చేసిన అనుష్క లేటెస్ట్‌గా ఆ సైలెన్స్‌ వీడింది. అంటే చిత్ర యూనిట్‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. లుక్‌లో అనుష్క డీసెంట్‌గా, ప్లెజెంట్‌గా కనిపిస్తోంది.

Image result for anushka silence

షార్డ్‌ హెయిర్‌ స్టైల్‌లో ఏవో బొమ్మలు గీస్తూ కనిపించింది. ఏ బొమ్మ వేసిందో చూపించలేదు కానీ, ఈ సినిమాలో అనుష్క మ్యూట్‌ ఆర్టిస్ట్‌గా కనిపించనుంది. అంటే మాటలు రాని చిత్రకారిణి అన్న మాట. సినిమాకి 'సైలెన్స్‌' అనే టైటిల్‌ ఎందుకు పెట్టారో ఫస్ట్‌లుక్‌తో చెప్పకనే చెప్పేశారు. ఈ మూగ ఆర్టిస్ట్‌ ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటుందట. ఆ సమస్య చుట్టూ కథ తిరుగుతుంది. కథను థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందించారు.

 

తమిళ నటుడు మాధవన్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఎక్కువ భాగం విదేశాల్లోనే ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు.గోపీ సుందర్‌ మ్యూజిక్‌ అందించారు. ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాతో పాటు, అనుష్క 'సైరా' లోనూ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS