'సాహో' కోసం కోటి ఆశలతో బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కొచ్చిన ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. అయితే, ఆశించిన స్థాయిలో ఆ సినిమా విజయం అందుకోలేకపోయింది. తనవంతుగా చేయాల్సిన ప్రయత్నం చేసినా, సినిమా సక్సెస్‌కి శ్రద్ధా తోడు కాలేకపోయింది. అయినా ఎంతో కొంత క్రేజ్ అయితే సంపాదించుకుంది. 'సాహో' ఒక్కదానితోనే కాదు, మంచి అవకాశాలొస్తే, సౌత్‌లో మరిన్ని సినిమాల్లో నటిస్తానని చెప్పిన శ్రద్ధా కపూర్, 'సాహో'తో వచ్చిన క్రేజ్‌ని నిలబెట్టుకునే దిశగా స్కెచ్‌లు ప్రిపేర్ చేసుకుంటోది. ఆ క్రమంలోనే సోషల్ మీడియాని హీటెక్కించే పని పెట్టుకుంది. హాట్ హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.
'సాహో' భామగా పేరు తెచ్చుకున్న శ్రద్ధా కపూర్ అంటే ఇప్పుడు దక్షిణాదిన తెలియని వారుండరు. ఒక్కసారి అభిమానించడం మొదలు పెడితే, మన తెలుగు ప్రేక్షకులు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. అందుకే అలాంటి డై హార్డ్ ఫ్యాన్స్‌ని మరింత ఎంకరేజ్ చేయడం కోసం శ్రద్ధా ఇస్తున్న సోషల్ ట్రీట్ అదిరిపోతోంది. తాజాగా నెట్టింట్లో ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ పిక్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ పిక్‌లో లైట్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్‌లో మోడ్రన్ డ్రస్ ధరించింది. పోనీ టెయిల్ ఆమె ఫేస్‌లో క్యూట్‌నెస్‌నీ, స్లీవ్‌లెస్ రన్నింగ్ టాప్ క్లీవేజ్ మెరుపుల్నీ ఎలివేట్ చేస్తున్నాయి. ఇక కాంట్రాస్ట్‌గా పింక్ కలర్‌లో మెరిసిపోతున్న విశనకర్రల్లాంటి చెవి పోగులు పిక్‌కే హైలైట్‌గా నిలిచాయి.