స్వీటీ బ్యూటీగా దక్షిణాదిన స్టార్డమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క. అయితే, గత రెండేళ్లుగా అనుష్క సినిమాల్లో కనిపించడం లేదు. స్టార్డమ్తో పాటు, ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే హీరోయిన్స్‌లో కూడా అనుష్క పేరే ముందుంటుంది. ఆ ప్రయోగంలో భాగంగా స్వీటీ చేసిన భారీ ప్రయోగం 'సైజ్‌జీరో'. ఈ సినిమా కోసం భారీగా వెయిట్ పెంచేసింది. అలా పెరిగిన ఆ వెయిట్‌ని దించుకోవడం స్వీటీకి కత్తిమీద సామే అయ్యింది పాపం. దాంతో కొన్నాళ్లు సినిమాలకు పూర్తిగా దూరమై ఆ బరువు బాధ్యతల పైనే దృష్టి పెట్టింది.
ఎట్టకేలకు ఆ బరువు బాధ్యతలు దించుకున్న స్వీటీ త్వరలో సెట్స్‌లోకి అడుగు పెట్టబోతోంది. మాధవన్ హీరోగా తెరకెక్కుతోన్న 'సైలెన్స్' అనే మూవీలో స్వీటీ నటిస్తోంది. హేమంత్ మధుకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఎక్కువ భాగం ఈ సినిమాని అమెరికాలోనే షూట్ చేయనున్నారట. దాంతో చిత్ర యూనిట్ ఆల్రెడీ అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు సిద్ధం చేసేసింది. సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్కతో పాటు, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే, స్వీటీ ఈ సినిమాలో ఎలా కనిపించబోతోంది.? అనే విషయమై ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ పిక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పిక్ చూశాక, ఫ్యాన్స్‌లో నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. నో డౌట్.. స్వీటీ గతంలో మాదిరి స్లిమ్‌గా అందంగా కనిపించబోతోంది.