స్వీటీ అనుష్క దాదాపు రెండున్నరేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటించిన సినిమా ‘నిశ్శబ్ధం’. టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ సినిమా కామ్‌గా షూటింగ్ కానిచ్చుకుంది. షూటింగ్ పూర్తయ్యింది. రిలీజ్‌కి దగ్గరైంది. కానీ, కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్‌కి బ్రేక్ పడిరది. ఇవన్నీ సరే, తన సినిమా ప్రమోషన్స్ నిమిత్తం స్వీటీ చేస్తున్న హంగామా మామూుగా లేదు. ఇప్పటికే షూట్ అయిన ‘నిశ్శబ్ధం’ ప్రమోషన్ కార్యక్రమాలు కరోనా హాలీడేస్‌తో ఇంట్లో ఉన్నవాళ్లను మస్త్ ఎంటర్‌టైన్ చేస్తున్నాయిలే. ఎక్కడ చూసినా స్వీటీనే కనిపిస్తోంది.
బుల్లితెరపై ఒక్కొక్కటిగా ప్రసారమవుతున్న ‘నిశ్శబ్ధం’ ప్రమోషన్ ప్రోగ్రామ్స్‌లో స్వీటీని మనసారా చూసి తరించిపోతున్నారు ఆడియన్స్. ఇన్నాళ్ల గ్యాప్‌ని స్వీటీ ఇలా తీర్చేస్తోందన్న మాట అని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. నిరంతరం కరోనా న్యూస్‌తో భయభ్రాంతులకు లోనవుతున్న ప్రజలకు స్వీటీ అప్పీయరెన్సు కాస్త రిలీఫ్‌గా అనిపిస్తోంది. ఒక్కో ఛానెల్‌లో ఒక్కో రకమైన పేర్లతో టెలికాస్ట్ అవుతున్న స్వీటీ స్పెషల్ ప్రోగ్రామ్స్ బుల్లితెర వీక్షకులకు కరోనా న్యూస్ నుండి కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తున్నాయి.