స్క్రీన్‌పై బీభత్సమైన గ్లామర్‌తో కనిపించే స్వీటీ బ్యూటీ అనుష్క బహిరంగ వేడుకల్లో ఎంత ట్రెడిషనల్‌గా కనిపిస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 'అరుంధతి' సినిమాకి ముందు వరకూ అనుష్క ఇమేజ్ ఓన్లీ గ్లామర్ డాళ్ అంతే.
కానీ 'అరుంధతి' తర్వాత ఆమె స్టారే మారిపోయింది. స్టార్ హీరోలకు సమానంగా ఆమెను పెట్టి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌ని తెరకెక్కించి, హిట్స్ కొట్టగలమన్న ధైర్యం మన దర్శక, నిర్మాతలకు కల్గించింది. నమ్మకం కల్గించడమే కాదు, చేసి చూపించింది కూడా. ఆ కోవలోనే లేటెస్టుగా 'భాగమతి'లా హీరోయిన్ సెంట్రిక్ మూవీతో వచ్చి, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది అనుష్క. 'భాగమతి' తర్వాత అనుష్క ఏం సినిమా చేయబోతోంది అంటూ ఆమె అభిమానుల్లో ఆశక్తి నెలకొంది.
అయితే అనుష్క చేయబోయే నెక్స్ట్ సినిమా కూడా థ్రిల్లర్ కాన్సెప్ట్‌లోనే ఉండబోతోందనీ తాజా సమాచారమ్. అయితే ఒకే జోనర్‌లో మళ్లీ మళ్లీ వచ్చి ఆడియన్స్‌కి బోర్ కొట్టించాలా అని అనుష్క చిన్నపాటి ఆలోచన చేస్తోందట. కానీ స్క్రిప్టు నచ్చడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అనుష్క ఎక్కువ ఆశక్తిగా ఉందని తెలుస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. అప్పుడెప్పుడో మంచు విష్ణుతో 'వస్తాడు నా రాజు' చిత్రం తెరకెక్కించిన హేమంత్ మధుకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో చాలా చాలా ప్రత్యేకతలున్నట్లు తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుష్క సరికొత్త గెటప్‌లో కనిపించనుందనీ సమాచారమ్.
అంతేకాదు, ఇంటర్నేషనల్ స్టేండర్ట్స్‌లో ఈ సినిమాని రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇదంతా వింటుంటే, మళ్లీ అనుష్క ఈ ప్రాజెక్ట్‌తో ఏదో మాయ చేసేలాగే ఉందనిపిస్తోంది.