'ఓయ్‌.! ఈ సారైనా హిట్‌ కొడతావా.!

మరిన్ని వార్తలు

చైల్డ్‌ ఆర్టిస్టుగా ముద్దులొలికే మాటల్తో తెలుగ ఆడియన్స్‌ని కట్టి పడేసిన చిన్నారి షామిలీ హీరోయిన్‌గా తొలి సినిమా 'ఓయ్‌'లో నటించింది. ఎంట్రీ ఈ భామకి అంతగా కలిసి రాలేదు. సినిమా సక్సెస్‌ కాలేదు సరికదా. లావుగా ఉందంటూ, హీరోయిన్‌ మెటీరియల్‌ కాదంటూ బోలెడన్ని నెగిటివ్‌ కామెంట్లు వెనకేసుకుంది. 

ఆ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరే సినిమాలోనూ కనిపించకపోయేసరికి, ఇక సినిమాలకు షామిలీ టాటా బైబై చెప్పేసింది కాబోలు అనుకున్నారంతా. కానీ తాజాగా యంగ్‌ హీరో నాగశౌర్యతో 'అమ్మమ్మగారిల్లు' అంటూ మళ్లీ సెకండ్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ నెల 25న 'అమ్మమ్మగారిల్లు' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇటీవల 'ఛలో' సినిమాతో నాగశౌర్య మంచి హిట్‌ కొట్టాడు. ఈ సినిమాతోనూ ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. హాట్‌ సమ్మర్‌లో 'అమ్మమ్మగారిల్లు' సిట్యువేషనల్‌గా ఉండడంతో, ఆడియన్స్‌ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమా వైపు ఎక్కువగా ఎట్రాక్ట్‌ అయ్యేలానే ఉన్నారు. ప్రోమోస్‌లో విలేజ్‌ నేటివిటీని అందంగా చూపిస్తున్నారు. 

ఈ మధ్య విలేజ్‌ నేటివిటీతో వస్తున్న సినిమాలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అవుతున్నాయి. ఆ కోవలో 'అమ్మమ్మగారిల్లు' చిత్రానికి సక్సెస్‌ కళ కనిపిస్తోంది. అంతేకాదు, 'అమ్మమ్మగారిల్లు' అనే టైటిల్‌కే చాలా మంది పడిపోయారు. ఎందుకంటే ప్రతీ ఒక్కరి జీవితంలోనూ అమ్మమ్మ ఇంటితో మాటల్లో చెప్పలేని ఎటాచ్‌మెంట్‌ ఉంటుంది. అందుకే ఈ సినిమాపై అంచనాలున్నాయి. అందులోనూ నాగశౌర్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. 

సో 'ఓయ్‌'తో నిరాశ పరిచిన షామిలి 'అమ్మమ్మగారిల్లు'తో హిట్‌ కొడుతుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS