మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఎంత పెద్ద క్రేజ్ ఉందొ స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ గా అంతే క్రేజ్ ఉంది. ఇక ఆమె తాజాగా అక్కినేని నాగ చైతన్య సవ్యసాచి చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో నర్తించనుందట.
ఇంతకి ఆ పాట మరేదో కాదు, నాగార్జున-రమ్యకృష్ణ ల మధ్య వచ్చిన “నిన్ను రోడ్డు మీద చూసినాది” పాట. అల్లరి అల్లుడు చిత్రంలోని ఈ పాటని ఇప్పుడు సవ్యసాచిలో రీమేక్ చేస్తున్నారట. ఇక ఇందుకోసం ఎంపిక చేసిన తమన్నాకి అక్షరాల రూ 60 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్టుగా సమాచారం.
త్వరలోనే ఈ పాటని చిత్రీకరిస్తారు అన్న సమాచారం ఉంది, అయితే షూటింగ్ తేదీలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇకపోతే, చైతు ఈ చిత్రం సవ్యసాచి పైన చాలా అంచనాలే పెట్టుకున్నట్టుగా అర్ధమవుతుంది, సోలోగా ఒక మంచి కమర్షియల్ హిట్ కోసం చాలా రోజులనుండే బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర చేస్తున్నాడు ఈ అక్కినేని వారసుడు.
చూద్దాం.. ఈ పాట సవ్యసాచి విజయానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ..