ఒక ఆరునెలల క్రితం ‘సుచి లీక్స్’ అన్న అంశం చుట్టూనే మీడియా మొత్తం తిరిగింది. ఇక ఇదే అంశం పైన పలువురు నటులు, నటీమణులు కూడా స్పందించడం జరిగింది.
అయితే గత కొంతకాలంగా వీటికి సంబంధించిన ఏ వార్త కూడా రాలేదు. ఈ తరుణంలో నటి అనుయా భగవత్ ముంబైలోని బాంద్రాకుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ నందు సుచి లీక్స్ అంశం పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదం ముగిసిపోయింది అని అనుకుంటున్న తరుణంలో ఇలా మళ్ళీ ఈ అంశం తెరపైకి రావడం సర్వాత్రా కొత్త చర్చకి ఆస్కారం ఇస్తున్నది.
ఇక తన ట్విట్టర్ అకౌంట్ ని కూడా ఎవరో హ్యాక్ చేసి తన మార్ఫ్ చేసిన ఫోటోలని అప్లోడ్ చేసారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కూడా ఈ ఫిర్యాదు విషయాన్ని దృవీకరించారు.