తార‌ల‌కు తాయిలాలు త‌య్యారు.

By iQlikMovies - July 14, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

సినిమా - రాజ‌కీయాలు.. ఇవి రెండూ ఫెవీకాల్‌లా ఎప్పుడో అతుక్కుపోయాయి. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు సినిమావాళ్లు రాజ‌కీయాల‌లో మ‌మేకం అవ్వ‌డం, సినీ గ్లామ‌ర్‌ని పార్టీలు వాడుకోవ‌డం మామూలే. ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా, ఆ పార్టీకి స‌పోర్ట్ చేసిన సినిమా వాళ్ల‌ని ఏమాత్రం మ‌ర్చిపోదు. వైకాపా గెలుపుకోసం కొంత‌మంది సినీ న‌టులు గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డ్డారు. మైకుల ముందు గొంతులు అరిగేలా స్పీచులు దంచికొట్టారు.

 

ప్ర‌చాక కార్య‌క్ర‌మాల్లోనూ జోరుగా పాలుపంచుకున్నారు. ఇప్పుడు వాళ్ల‌కు తాయిలాలు త‌య్యారైపోయాయి. మొద‌టి గిఫ్టు 30 ఇయ‌ర్స్ పృథ్వీకి అందింది. వైకాపా త‌ర‌పున ఫృథ్వీ గ‌ట్టిగా ప్ర‌చారం చేశాడు. కొన్నిసార్లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి వ్య‌తిరేకంగానూ గ‌ళం ఎత్త‌డానికి ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌లేదు. అందువ‌ల్ల కొన్ని సినిమా అవ‌కాశాలూ చేజారాయి. అయినా అధైర్య‌ప‌డలేదు. ఇప్పుడు పృథ్వీ క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఫృథ్వీకి నామినేటెడ్ పోస్టు క‌ట్ట‌బెట్టింది.

 

ఎస్వీబీసీ ఛైర్మ‌న్‌గా ఫృథ్వీని నియ‌మిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కొత్త ప్ర‌భుత్వంలో సినిమావాళ్లకు అందిన తొలి నామినేటెడ్ పోస్టు ఇదే. ఇది వ‌ర‌కు ఈ పోస్టులో కె.రాఘ‌వేంద్ర‌రావు ఉండేవారు. ఇటీవ‌ల ఆ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పోస్టు ఫృథ్వీకి ద‌క్కింది. త్వ‌ర‌లోనే అలీకి కూడా ఎమ్‌.ఎల్‌.సీ కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం. మోహ‌న్ బాబు, జీవిత కూడా లిస్టులో ఉన్నారు. వీళ్లిద్ద‌రికీ మంచి ప‌ద‌వులే ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS