ఏపీ ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య మరో వివాదం రాజుకుంది. సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈనెల 2న 69 ను విడుదల చేశారు. నెల రోజుల్లోపు థియేటర్లు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది సర్కార్. ఎంవోయు చూసి ఎగ్జిబిటర్లు షాక్ తిన్నారు. టికెట్ల విక్రయం తర్వాత థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తామని అవగాహన ఒప్పందం లో లేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఆన్లైన్ విక్రయాలు ఫిలిం ఛాంబర్ ద్వారా నిర్వహిస్తామని తొలినుంచి ఎగ్జిబిటర్లు మాట. కావాలంటే ప్రభుత్వానికి లింక్ ఇస్తామని కూడా లేఖ రాశారు.
ఐతే ప్రభుత్వ గేట్వే ద్వారానే టికెట్లు విక్రయించాలని సర్కార్ జిఓ విడుదల చేసింది. వచ్చే నెల రెండు లోపు ఒప్పందంపై సంతకం చెయ్యకపోతే థియేటర్ లైసెన్స్లు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎంవోయూ పై సంతకం పెడితే ప్రభుత్వ కబంధహస్తాల్లో చిక్కినట్టేనని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. ఎగ్జిబిటర్ ల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకు వెళుతూ తెలుగు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. థియేటర్లు మూసేందుకు సిద్దం కానీ ఎంవోయూ పై సంతకం చేసే ప్రసక్తిలేదని తేల్చిచెబుతున్నారు ఎగ్జిబిటర్లు. మరి ఈ వివాదానికి ఎలాంటి ముంగిపు దొరుకుతుందో చూడాలి.