Sai Pallavi: భారమంతా సాయి పల్లవిదే

మరిన్ని వార్తలు

సాయి పల్లవి మంచి నటి. ఆమె చేసిన పాత్రలు అభిమానులని అలరించాయి. చాలా సినిమాలు ఆమె కారణంగానే విజయం సాధించాయి. అయితే మునుపెన్నుడు లేని భారం విరాటపర్వం కోసం మోస్తుంది సాయి పల్లవి. నక్సల్ నేపధ్యం వున్న సినిమా ఇది. ఈ రోజుల్లో అ నేపధ్యం వర్క్ అవుట్ కాదని సినిమా యూనిట్ కి తెలుసు. అందుకే ప్రమోషన్స్ లో తెలివిగా ప్రేమకథని పైకి తీసుకొచ్చారు. సాయి పల్లవి వెన్నెల పాత్రని హైలెట్ చేసుకుంటూ వెళ్లారు. ''ఇది సాయి పల్లవి ఫ్యాన్స్ కోసం తీసిన సినిమారా బాబు'' అని స్వయంగా రానా యాడ్ చేశాడు. మిగతా టీమ్ అంతా సాయి పల్లవి నామస్మరణ చేస్తుంది.

 

ప్రిరిలిజ్ ఈవెంట్ లో వెంకటేష్ కూడా సాయి పల్లవిపైనే భారం అంతా వేశేశారు. ''ఇది సాయి పల్లవి సినిమా. సాయి పల్లవి కెరీర్ లో విరాటపర్వం ఒక బెస్ట్ ఫిల్మ్. విరాట పర్వంలో నటనగాను సాయి పల్లవికి జాతీయ అవార్డ్ వస్తుంది. అంత అద్భుతంగా వుంది సాయి పల్లవి నటన'' అని ఆకాశానికి ఎత్తారు వెంకీ. ఇప్పుడు అందరికళ్ళు సాయి పల్లవిపైనే వున్నాయి. ఇన్నాళ్ళ కెరీర్ లో కేవలం సాయి పల్లవి బ్రాండ్ తోనే వస్తున్న సినిమా విరాట పర్వం కావడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS