బాలీవుడ్ వాళ్లకు సౌత్ కథలపై మక్కువ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇక్కడి యావరేజ్ లను కూడా వాళ్లు వదిలి పెట్టడం లేదు. ఆఖరికి పాత సినిమాల్ని కూడా తవ్వుకుపోతున్నారు. తాజాగా వాళ్ల దృష్టి `అపరిచితుడు`పై పడింది. శంకర్ - విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. విక్రమ్ ని స్టార్ గా మలిచేసింది. తమిళ సినిమానే అయినా, తెలుగులో ఇంకా బాగా ఆడింది. ఈ సినిమాతో విక్రమ్ కంటూ ఓ బ్రాండ్ ఏర్పడింది.
ఇప్పుడు ఈసినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని రీమేక్ చేసి పెట్టమని ఓ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శంకర్ ని సంప్రదించినందని టాక్. దానికి శంకర్ కూడా ఓకే చెప్పాడట. బాలీవుడ్ యంగ్ స్టార్ రణబీర్ సింగ్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం ఉందని టాక్. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాకే.. అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ మొదలవుతుంది.