హీరో సల్మాన్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ లు తెలుగు నేలలో అడుగుపెట్టనున్నారు.
ఎందుకు అని అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో జరగుతున్న బీచ్ ఫెస్టివల్ కి వీరు అతిథులుగా రానున్నారు అని సమాచారం. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్ నిన్న మొదలయ్యి రేపు ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరితో ముగియనుంది.
నవంబర్ 26న హైదరాబాద్ లో జరిగిన కాన్సర్ట్ కి ఏఆర్ రెహ్మాన్ రావడం ఇక్కడ తన సంగీతంతో ఆడియన్స్ ని మాయ చేయడం తెలిసిందే. ఇక రేపు తన సంగీతంతో కాకినాడ వాసులని సమ్మోహితులని చేయడం ఖాయం.
మొత్తానికి AP సర్కార్ ఆ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయాడానికి చేస్తున్న కార్యక్రమాలలో భాగంగానే ఈ బీచ్ ఫెస్టివల్ జరుగుతున్నది.