అరణ్య తనకు వెరీ స్పెషల్‌ అంటోన్న రానా.!

మరిన్ని వార్తలు

బాహుబలి సినిమా తర్వాత ఎక్కువ డేట్స్‌ తీసుకున్న సినిమా ‘అరణ్య’ అంటున్నాడు రానా. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అరణ్య’. నేచర్‌ అంటే విపరీతమైన ప్రేమ ఉన్న ఓ వ్యక్తి సొంతంగా అడవిని సృష్టిస్తే ఎలా ఉంటుంది.? ఆ అడవిని కన్న బిడ్డలా సాకే ఆ మనిషి, దాని జోలికి వచ్చిన వారిని ఊరికే వదుతాడా.? అస్సలూరుకోడు. మరి ఏం చేశాడు.? అనేది తెలియాంటే రానా ‘అరణ్య’ చూడాలి. ఏప్రిల్‌ 2న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సినిమా కోసం రానా చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఈ స్టోరీ అర్ధం చేసుకోవడానికే ఆరు నెల సమయం తీసుకున్నాడట.

 

ఇక మేకోవర్‌ కోసం మరింత కష్టపడ్డాడు. ఆ కష్టమంతా తెరపై కనిపించేలానే ఉంది టీజర్‌ చూస్తే. అస్సాంకి చెందిన ఓ ప్రకృతి ప్రేమికుని జీవిత గాధ ఆధారంగా ‘అరణ్య’ తెరకెక్కింది. ఈ సినిమాలో రానా ఏకంగా 35 ఒరిజినల్‌ ఏనుగులతో కలిసి నటించాల్సి వచ్చిందట. చాలా రోజులు థాయ్‌లాండ్‌ అడవుల్లో జీవనం సాగించాల్సి వచ్చిందట. అంత కష్టపడినా, సినిమా అవుట్‌ పుట్‌ చూశాకా, ఆ కష్టమంతా తీరిపోయిందంటున్నాడు. జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు, ప్రతీ ఒక్కడి డాష్‌ తీర్చేస్తుంది..అని ఎన్టీఆర్‌ ఓ సినిమాలో డైలాగ్‌ చెబుతాడు. కానీ, ఎన్నో సినిమాలు చేసిన తనకు జీవితం అంటే ఏంటో తెలిపిన చిత్రం ‘అరణ్య’.. అని రానా చెబుతున్నాడు.

 

ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మూడు భాషల్లో రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమా తనకు అంత స్పెషల్‌ అంటున్నాడు. మరి రానా పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందో లేదో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS