ముద్దుగుమ్మ ముద్దు పెడితే, ఎలా ఉంటుంది.? తొలి ముద్దు అనుభవం ఎలా ఉంటుంది.? ఇలాంటి ప్రశ్నలకు అబ్బాయి నుండి వారి వారి ఎక్స్పీరియన్సెస్కి తగ్గట్లుగా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వింటుంటాం. కానీ, ఇక్కడేంటీ.? అక్కినేని బుల్లోడు నాగ చైతన్య అడక్కుండానే అమ్మాయి ముద్దు పెడితే, ఏడుస్తాడేంటీ.? అందుకే ఉండబట్టలేక ఆ అమ్మాయే అడిగేసింది. ముద్దు పెడితే ఏడుస్తారా.. అబ్బా.! అని. ఇంతకీ ఈ ముచ్చట ఎక్కడిది అనుకుంటున్నారా.? నాగచైతన్య, సాయిప్లవి జంటగా తెరకెక్కుతోన్న ‘లవ్‌స్టోరీ’ సినిమాలోనిది. వాలంటైన్స్‌డే సందర్భంగా ల‘వ్‌స్టోరీ’ సినిమా నుండి ‘ఏయ్ పిల్లా..’ అను మ్యూజికల్ రివ్యూ రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య లవ్‌ని హృద్యంగా చూపించారు. ఈ క్రమంలోనే చైతూ బుగ్గపై సాయి పల్లవి గాఢంగా ముద్దు పెట్టింది. ఆ ముద్దుకు కొంచెం ఎక్కువగా ఫీలయిన నాగచైతన్య ఏడ్చేశాడు. ముద్దు పెడితే, తన్మయత్వంలో మునిగిపోయే అబ్బాయిల్ని చూశాం కానీ, ఇలా తన తన్మయత్వాన్ని ఏడుపు రూపంలో వ్యక్తపరిచిన అబ్బాయిని మాత్రం ఇదిగో నాగచైతన్యనే చూస్తున్నాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా చైతూ ‘లవ్‌స్టోరీ’తో స్టార్టింగ్‌లోనే మంచి మార్కులు కొట్టేశాడు. చైతూ, సాయి పల్లవి జంట చూడచక్కగా ఉండడంతో పాటు, కెమిస్ట్రీ కూడా క్యూట్‌గా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది.