రానా చేసిన మరో పాన్ ఇండియా సినిమా `అరణ్య`. కరోనా భయాల కారణంతో.. ఈ సినిమా హిందీలో విడుదల కాలేదు గానీ, మిగిలిన భాషల్లో ప్రేక్షకుల ముందుకు వెళ్లింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. దాంతో.. వసూళ్లు అంతంతమాత్రంగానే వచ్చాయి. దర్శకుడి ఆలోచన బాగున్నా - కథాంశాన్ని కమర్షియల్ గా మలచలేకపోయాడని విమర్శకులు తేల్చేశారు. `రంగ్ దే` నుంచి గట్టి పోటీ ఎదురవ్వడంతో.. వసూళ్లు పంచుకోవాల్సివచ్చింది. తొలి మూడు రోజుల్లో అరణ్యకు రూ.4.10 కోట్లే దక్కాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 15 కోట్లయినా తెచ్చుకోవాలి. ఆ మార్క్ దాటడం రానా సినిమాకి అసాధ్యంలానే కనిపిస్తోంది.
అరణ్య తొలి మూడు రోజుల వసూళ్లు ఇవీ..
నైజాం : Rs 84 లక్షలు
సీడెడ్ : Rs 37 లక్షలు
ఉత్తరాంధ్ర : Rs 40 లక్షలు
ఈస్ట్ : Rs 22 లక్షలు
వెస్ట్ : Rs 16 లక్షలు
గుంటూరు : Rs 32 లక్షలు
కృష్ణ : Rs 19 లక్షలు
నెల్లూరు : Rs 10 లక్షలు
ఏపీ. తెలంగాణ మొత్తం : Rs 2.60 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : Rs 1.32 కోట్లు
ఓవర్సీస్ : Rs 18 లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా: Rs 4.10 కోట్లు (షేర్)